Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసును ప్రేమించావా? అయితే వద్దన్న పేరెంట్స్, పేల్చుకున్న ప్రియుడు

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (19:32 IST)
గాఢంగా ప్రేమించాడు. ఆమె సర్వస్వం అనుకున్నాడు. పెళ్లి చేసుకొని జీవితాన్ని హాయిగా గడుపుదామనుకున్నాడు. కానీ అతని ఆశలన్నీ ఆవిరయ్యాయి. పోలీసుకు తమ కూతుర్ని ఇచ్చేది లేదని ప్రేమించిన యువతి తల్లిదండ్రులు చెప్పడంతో నిరాశకు గురయ్యాడు. 
 
ఎప్పటికైనా తెలుసుకొని ఆమెను తనకు ఇచ్చి వివాహం చేస్తారని కలలుగన్నాడు. కానీ రహస్యంగా తన ప్రియురాలికి వేరొకరితో వివాహం చేస్తున్నారని ఊహించలేకపోయాడు. విధులు నిర్వర్తిస్తూనే తన తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.
 
చిత్తూరు జిల్లా రేణిగుంటలో తుపాకీతో కాల్చుకుని ఆర్.పి.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యారక్స్ డ్యూటీలో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున 4:15 గంటలకు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిపురం ఆనందరావు ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా రేణిగుంటలో విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీకాకుళంలోని తన స్వగ్రామంలో ఒక యువతిని నాలుగు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు ఆనందరావు.
 
ఆనందరావును ఆ యువతి కూడా గాఢంగా ప్రేమించింది. ఈ విషయాన్ని తన ఇంటిలో చెప్పింది. అయితే యువతి తల్లిదండ్రులు పోలీసును ప్రేమించడాన్ని తప్పుబట్టారు. పోలీసుతో పెళ్లి వద్దంటూ తేల్చారు. దీంతో కొన్ని రోజుల పాటు ఇద్దరు దూరంగా ఉంటూ వచ్చారు.
 
అయితే ఉన్నట్టుండి యువతిని బలవంతం చేసి వివాహం నిశ్చయించారు. తను చేసుకోవాల్సిన యువతి మరొకరిని పెళ్లాడుతోందని తెలుసుకున్న ఆనందరావు ఆవేదనకు గురయ్యాడు. మరోవైపు విధుల్లోను అధికారుల నుంచి ఒత్తిడి ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
ఉదయం విధుల్లో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు ఆనందరావు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆనందరావు జేబులోని సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments