అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (11:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభించింది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విపరీతంగా కోళ్లు చనిపోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని అక్కంపల్లి రిజర్వాయర్‌లో వందల సంఖ్యలో చనిపోయిన కొళ్లు కొట్టుకుని వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కోళ్లను ఈ రిజర్వాయర్‌లో పడేసినట్టు సాచారం. హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు ఈ రిజర్వాయర్ నుంచే తాగునీటిని సరఫరా చేస్తుంటారు. దీంతో ఆ ప్రాంత వాసులు బర్డ్ ఫ్లూ భయంతో వణికిపోతున్నారు. 
 
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించారు. నల్గొండ ఎస్పీ శరత్ చంద్రా దర్యాప్తును చేపట్టారు. దేవరకొండ ఆర్డీవో, నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్‌ను పరిశీలించారు. బర్డ్ ఫ్లూ కేసులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత భయాందోళనకు గురిచేస్తుంది. రిజర్వాయర్‌లో చచ్చిన కోళ్లను పడేసిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటి శాంపిల్స్ సేకరించిన అధికారులు వాటిని పరీక్షలకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

అప్పట్లో తెలియక బెట్టింగ్ యాప్‌ని గేమింగ్ యాప్ అనుకుని ప్రమోట్ చేసా: ప్రకాష్ రాజ్ (video)

కాంత లాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి : దుల్కర్ సల్మాన్, రానా

సంతాన ప్రాప్తిరస్తు తెలుగు మీల్స్ తిన్నంత తృప్తి కలిగింది - తరుణ్ భాస్కర్

కొదమసింహం రీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments