Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడులో నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి యువకుడి హత్య.. కారణం ఇదే: ఎస్పీ

సెల్వి
గురువారం, 18 జులై 2024 (12:27 IST)
SP Srinivas
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై ఓ యువకుడిని హత్య చేసిన ఘటనపై  పల్నాడు జిల్లా ఎస్పీ కే.శ్రీనివాసరావు స్పందించారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన వెనుక వ్యక్తిగత కక్షలే కారణమని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. 
 
ఈ హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వుండేందుకు గాను 144 సెక్షన్ విధించామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. 
 
కాగా ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా షేక్‌ రషీద్‌ అనే యువకుడు ముండ్లమూరు బస్టాండ్‌ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బయటకు వస్తుండగా... హతుడి మాజీ మిత్రులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎస్పీ స్పందించారు. ఈ ఘటనపై టీడీపీ కూడా ధీటుగా స్పందించింది. 
 
హతుడు షేక్‌ రషీద్‌, చంపిన వ్యక్తి షేక్‌ జిలానీ ఇద్దరూ వైసీపీ వారేనని, వీరిద్దరూ వినుకొండలో రౌడీగా చెలామణి అవుతున్న వైసీపీ నేత పీఎస్‌ ఖాన్‌కు ప్రధాన అనుచరులు అనే విషయాన్ని పేర్కొంది. జగన్ రెడ్డికి ఈ పీఎస్ ఖాన్ ప్రధాన అనుచరుడు అని మండిపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments