Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిలో స్టీరింగ్.. కాలికింద ఎక్సలేటర్... 200 కి.మీ స్పీడ్‌తోనే నిషిత్ డ్రైవ్...

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏపీ మంత్రి పి. నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మామూలోడు కాదట. చేతిలో స్టీరింగ్.. కాలికింద ఎక్సలేటర్ ఉంటే... కారు 200 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లాల్సిందేనట. ఈ విషయం ఎవరో చెప్పేంది

Webdunia
గురువారం, 11 మే 2017 (16:43 IST)
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏపీ మంత్రి పి. నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మామూలోడు కాదట. చేతిలో స్టీరింగ్.. కాలికింద ఎక్సలేటర్ ఉంటే... కారు 200 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లాల్సిందేనట. ఈ విషయం ఎవరో చెప్పేంది కాదు.. సాక్షాత్ హైదరాబాద్ నగర పోలీసు రికార్డులు చెపుతున్నాయి. 
 
హైదరాబాద్, బంజారా హిల్స్‌లో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నిషిత్ నడుపుతూ వచ్చిన కారు టీఎస్07, ఎఫ్‌కే 7117 కారు ప్రమాదానికి గురైంది. మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో కారులోని నిషిత్‌తో పాటు.. అతన్ని స్నేహితుడు దుర్మరణంపాలయ్యారు. ఈ ప్రమాదానికి గురైన బెంజ్‌ కారు వేర్వేరు సందర్భాల్లో పరిమితికి మించి వేగంగా వెళ్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు స్పీడ్‌గన్‌తో గుర్తించారు. 
 
ఈ యేడాది మార్చి 10వ తేదీ వరకు మూడు నెలల్లో మూడుమార్లు ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తున్నట్లు గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు రూ.4305 ఫైన్‌ వేశారు. చివరగా మార్చి 10న కూడా మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిషిత్‌ కారు ఓవర్‌ స్పీడ్‌ను గుర్తించి ఫైన్‌ వేశారు. 
 
సరిగ్గా రెండు నెలలకు, అంటే ఈనెల 10వ తేదీ బుధవారం వేకువజామున జరిగిన ప్రమాదంతో నిషిత్‌తో పాటు అతని స్నేహితుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలోనూ కారు గంటకు 210 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ఉండివుంటాడని, అందుకే నిషిత్‌, అతని స్నేహితుడు ప్రమాదం నుంచి బయటపడేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా పోయిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి నారాయణ లండన్‌లో ఉన్నారు. ఆయన ఈ వార్త విని కుప్పకూలిపోయారు. అయితే ఇండియాకి వచ్చిన నారాయణ కొడుకు మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడని తనకు తెలియదని, తెలిసి ఉంటే వారించేవాడినని నారాయణ ఉద్వేగానికి లోనయ్యారు.
 
తనతో కలిసి ప్రయాణించినప్పుడు మామూలు వేగంతోనే వెళ్లేవాడని, అందుకే తానెప్పుడు అనుమానించలేదని మంత్రి నారాయణ చెప్పారు. అప్పటికీ వేగంగా వెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించానని ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments