Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొదలకూరు ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు : కాకాణి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:16 IST)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, కోవిడ్ ఉద్ధృతి దృష్ట్యా పొదలకూరు మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, కోవిడ్ సోకిన వారికి అవసరమైన ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు, మే 1వ తేదీ నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ, పారిశుధ్య నిర్వహణ, ప్రజలకు అవగాహన కల్పించడం పలు అంశాలపై అధికారులు, వైద్య సిబ్బందితో స్థానిక శాసనసభ్యులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి చర్చించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అవసరమైన ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచేందుకు, పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు చేస్తున్నాం. 
 
పొదలకూరు ఆరోగ్య కేంద్రంలో ప్రాథమికంగా 8 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసి, అవసరాలకు అనుగుణంగా 20 వరకు పెంచేందుకు ఆలోచన చేస్తున్నాము.
 
 పొదలకూరు ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు, అవసరమైన సామాగ్రిని, సిబ్బందిని అందించేందుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అంగీకరించారు. ప్రజలెవ్వరూ కూడా భయాందోళనలకు గురికాకుండా, కరోనా పట్ల అవగాహన కలిగి, అప్రమత్తంగా వ్యవహరించాలి.
 
కరోనా రెండో విడత ఉద్ధృతమవుతున్న దృష్ట్యా, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవసరమైన మందులు, తగినంత సిబ్బందిని నియమించడంతో పాటు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
 
మే 1వ తేదీ నుండి 45 సంవత్సరాల వయసు లోబడిన వారికి కూడా సత్వరమే వ్యాక్సిన్ అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా ప్రబలడానికి అవకాశాలు లేకుండా పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, గుంపులుగా ఒకచోట చేరకుండా నియంత్రించేందుకు పోలీసులు యంత్రాంగం తగు చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాము. ఘోర విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి శతవిధాల ప్రయత్నిస్తున్నాం. 

అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వవలసిన ప్రతిపక్షం, చంద్రబాబు నాయుడు అర్ధరహిత విమర్శలు చేయడం దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్దికోసం చివరకు ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టేందుకు వెనుకాడడం లేదు.
 
సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా రెండో విడత విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలిచి, అవసరమైన వైద్య సహాయం అందించడంతో పాటు, ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోషన్ కనకాల చిత్రం మోగ్లీ 2025 ప్రారంభం

Ram Gopal Varma : తెలంగాణ పోలీసులు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్టు చేస్తారా?

ఆర్.ఆర్.ఆర్.కు ముందే రామ్ చరణ్ తో సినిమా నిర్ణయం తీసుకున్నా : డైరెక్టర్ శంకర్

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి దిల్ రూబా టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments