Webdunia - Bharat's app for daily news and videos

Install App

Operation Sindoor: కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు- పవన్ కల్యాణ్ (video)

సెల్వి
బుధవారం, 7 మే 2025 (13:44 IST)
దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హితవు పలికారు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు అంటూ పవన్ హెచ్చరించారు. ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు. కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 
 
ఆపరేషన్ సింధూర్‌పై పవన్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు ఇది తగిన గుణపాఠమని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ధీటైన జవాబు ఇచ్చామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామమని, సోషల్‌ మీడియాలో ఏది పడితే అది మాట్లాడకూడదన్నారు. 
 
భారత్‌ దాడిపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు ఉంటాయన్నారు. పహల్గాం దాడితో భారత్ పుట్టెడు దుఃఖంతో మునిగిపోయిందని హిందువు, ముస్లిం అని అడిగి మరీ చంపేసిన విధానం చాలా దారుణమని చెప్పారు. 
 
ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడిని స్వాగతించినట్లు చెప్పారు. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి... ఆపరేషన్‌ సిందూర్‌తో తిరిగి వీరత్వాన్ని నింపిందని కొనియాడారు. త్రివిధ దళాధిపతులు, ప్రధాని మోదీకి ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలిపారు. పాక్‌లో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలకకుండా, ప్రాణ నష్టం జరగకుండా.. కేవలం ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments