Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయలు వచ్చేస్తున్నాయోచ్... ఎక్కడికి?

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:00 IST)
న్యూఢిల్లీ : దేశంలో ఉల్లిపాయల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. తొలి దశలో 790 టన్నుల ఉల్లిపాయలు ముంబయి చేరుకున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి సోమవారం తెలిపారు. అందులో కొంత సరుకును ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లకు దిగుమతి ఖర్చు రూ.57/రూ.60గా నిర్ణయించి సరఫరా చేస్తున్నామని చెప్పారు. 
 
టర్కీ, ఈజిప్టు, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. ఈ నెలాఖరుకు మరో 12 వేల టన్నుల ఉల్లిపాయలు రావచ్చునని తెలిపారు. ప్రభుత్వం తరుపున మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎంటిసి) 49,500 టన్నుల ఉల్లి దిగుమతికి ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది.
 
కేజీ ఉల్లి ధర రూ.100 నుంచి రూ.160కు చేరుకున్న నేపథ్యంలో విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments