Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమండీ.. మరిది వేధిస్తున్నాడు.. పట్టించుకోని భర్త.. వివాహిత అనుమానాస్పద మృతి

ఒంగోలు జిల్లా గుడ్లూరు మండలం రావూరు గ్రామానికి చెందిన ఓ వివాహిత అనుమానాస్పదంగా చనిపోయింది. ఆమె చనిపోయిన రెండు రోజులకే ఆమె మరిది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం రేక

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (11:37 IST)
ఒంగోలు జిల్లా గుడ్లూరు మండలం రావూరు గ్రామానికి చెందిన ఓ వివాహిత అనుమానాస్పదంగా చనిపోయింది. ఆమె చనిపోయిన రెండు రోజులకే ఆమె మరిది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం రేకెత్తిస్తోంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే ఈ గ్రామానికి చెందిన ప్రమీల అనే మహిళ భర్తతో కలిసి ఉంటోంది. ఈ ఇంటిపక్కనే ఆమె మరిది మిరియం బంగారయ్య (36) కూడా నివాసం ఉంటున్నాడు. అయితే, అన్న లేని సమయంలో వదినను లైంగికంగా వేధిస్తూ వచ్చినట్టు సమాచారం.
 
ఈ విషయాన్ని ఆమె భర్త దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. అదేసమయంలో ఆమె రెండు రోజుల క్రితం అనుమానాస్పదస్థితిలో  మరణించింది. ఇపుడు వదిన చనిపోయిన రెండు రోజులకే బంగారయ్య కూడా చనిపోవడం చర్చనీయాంశమైంది.
 
గ్రామస్తులంతా మరిది చేష్టలను భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించగా ఆమె తల్లిదండ్రులు బంగారయ్యే మా బిడ్డ మృతికి కారణమని ఆరోపించారు. తనపై పోలీసు కేసు పెట్టిందన్న కసితో బంగారయ్యే ఆమెను హత్య చేసి ఉరేసి ఉంటాడన్న అనుమానాలున్నాయి.
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో తనను ఎక్కడ అరెస్టు చేస్తాడన్న భయంతో బంగారయ్య ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం