Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 2తో ముగుస్తుంది.. ఆ తర్వాత ఎక్కడుంటానో తెలియదు : స్మృతి ఇరానీ

తన రాజకీయ భవిష్యత్‌పై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఈ ప్రదర్శన జూలై రెండో తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత తాను ఎక్కడుంటానో తెలియదని, ఇక తన రాజకీయ భవిష్యత్ గురిం

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (11:04 IST)
తన రాజకీయ భవిష్యత్‌పై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఈ ప్రదర్శన జూలై రెండో తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత తాను ఎక్కడుంటానో తెలియదని, ఇక తన రాజకీయ భవిష్యత్ గురించి ఏమని సమాధానం చెప్పగలనని సమాధానమిచ్చింది. 
 
కేంద్ర జౌళి శాఖ ఆధ్వ‌ర్యంలో గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌లో జ‌రుగుతున్న ఇండియా టెక్స్‌టైల్ ఎగ్జిబిష‌న్‌కు ఆ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ హాజ‌ర‌య్యారు. ఈసందర్భంగా ఓ విలేకరి ఆమెకు ఓ ప్రశ్న వేశారు. 2019 ఎన్నిక‌ల్లో అమేథీలో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏమిటని ప్రశ్నించారు. 
 
ఈ ఎగ్జిబిష‌న్ జూలై 2న ముగుస్తుందని తెలిపారు. ఆ రోజు త‌ర్వాత ఎక్క‌డ ఉంటాన‌నే విష‌య‌మే నాకు తెలియ‌దు, ఇక 2019 ప‌రిస్థితి గురించి ఎలా చెప్ప‌గ‌ల‌ను అంటూ స‌మాధాన‌మిచ్చారు. 
 
టెక్స్‌టైల్ ఎగ్జిబిష‌న్ గురించి మాట్లాడుతూ ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న జ‌ర‌గ‌లేదు. మేం ఊహించిన దాని కంటే ఎక్కువ మంది దేశ‌, విదేశీయులు ఈ ప్ర‌ద‌ర్శ‌న‌కు వ‌స్తున్నారు. ఇది అనుకోకుండా సాధించిన విజ‌యమన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments