Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ నేషన్- వన్ రేషన్ కార్డుతో అక్రమాల‌కు చెక్

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (10:21 IST)
ఒన్ నేషన్, ఒన్ రేషన్ కార్డు విధానంతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పేర్కొన్నారు. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు .ఒన్ నేషన్ వన్ రేషన్ కార్డు పేరిట దేశ వ్యాప్తంగా ఎక్కడైనా లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంది. రేషన్ దుకాణాల్లో అక్రమాలు తగ్గుముఖం పట్టడం తోపాటు, వలస కార్మికులు వంటి వారికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. 
 
జాతీయ ఆహార భద్రతా చట్టం 2013కు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (IM-PDS) కింద ఇప్పటికే అక్రమాలు తగ్గుముఖం పట్టడం తోపాటు వలస కార్మికులు వంటి వారికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే ఎపి, తెలంగాణ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈవిధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల కార్డుల డూప్లికేషన్‌ను కూడా అరిక్టేందుకు పూర్తి అవకాశం ఏర్పడింది.
 
ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డు విధానంతో జాతీయ ఆహర భద్రతా చట్టం కింద దేశంలో సుమారు 80 కోట్ల మంది రేషన్ పొందుతున్నలబ్దిదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కార్డుదారులు వారి రేషన్ సరుకులను ఏ రేషన్ దుకాణం నుండైనా పొందేందుకు వీలుకలుగుతోంది. ముఖ్యంగా వలస కార్మికులు, రోజు వారీ కూలీలు, పట్టణ ప్రాంత పేదలు ముఖ్యంగా చెత్త కాగితాలు ఏరుకునేవారు, వీధుల్లో నివసించేవారు, సంఘటిత, అసంఘటిత రంగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే కార్మికులు వంటి వారికి ఈ విధానం ఎంతగానో ప్రయోజనం కల్గిస్తుంది. అంతేగాక దేశవ్యాప్తంగా మెరుగైన ఉపాధి అవకాశాలకై తరచు వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళే వారికి ఈ విధానం ఎంతో మేలు కల్గిస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments