Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా.. విశాఖలో జడుసుకుంటున్న జనం

Webdunia
మంగళవారం, 19 మే 2020 (13:38 IST)
కరోనా కేసులు దేశంలో లక్షను దాటాయి. అలాంటి మహమ్మారి కరోనాతో పోరాటం చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. అలాంటిది ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి కరోనా వస్తే ఎలా వుంటుంది. ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా వస్తే అతని పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖలోని ఓ కుటుంబంలో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా సోకింది. విశాఖలో ఓ కుటుంబంలో 8 మంది నివసిస్తుంటారు. వీరిలో మొదట ముంబై నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి మొదట కరోనా సోకింది. ఏప్రిల్ 1 వ తేదీన కరోనా సోకింది.
 
కాగా, కరోనాకు ట్రీట్మెంట్ తీసుకోవడంతో నయం అయ్యి ఇంటికి వచ్చాడు. ఆ తరువాత ఇంట్లో అందరికి కరోనా సోకింది. ఆ తరువాత మరలా మొదట కరోనా సోకిన వ్యక్తికి తిరిగి కరోనా రావడంతో వైద్య సిబ్బంది షాక్ అయ్యారు.
 
ఒకేసారి వచ్చిన వ్యక్తిలో వైరస్‌ను అడ్డుకోగలిగే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని, అవి కరోనాను ఎటాక్ చేసే శక్తిని కలిగి ఉంటాయని వైద్యులు చెప్తుండగా, కరోనా ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని రోజులకే తిరిగి రెండోసారి కరోనా సోకడంతో వైద్యులతోపాటు అటు వైజాగ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments