Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 8న ఎమ్మార్పీఎస్​ యుద్ధభేరి: మందకృష్ణ

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (22:06 IST)
హత్యలు, హత్యాచారాల ఘటనలపై రాష్ట్ర సర్కారు, పోలీసు యంత్రాంగం అగ్రకులాల విషయంలో ఒక రకంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి మరోరకంగా వ్యవరిస్తోందని మందకృష్ణ ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తామని వెల్లడించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

దీన్ని నిరసిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8న 'ఛలో కొంగరకలాన్​-ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాల యుద్ధభేరి' పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.  హైదరాబాద్​లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాములు నాయక్, మాల మహానాడు జాతీయాధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సభ విజయవంతం కోసం... ఈ నెల 16నుంచి సన్నాహక యుద్ధభేరి భేరి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా... మార్చ్ 5 వరకు నిర్వహిస్తామని తెలిపారు.

వేదికపై ఎటువంటి రాజకీయ పార్టీలకు ఆహ్వానం ఇవ్వమని... రెండు రోజుల్లో సన్నాహక యుద్ధభేరి సభలపై మరింత స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలక్రిష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి సందడి చేస్తుందా? డాకు మహారాజ్ రివ్యూ

మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నాను : హీరో విశాల్

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments