బ్లాక్ డే... ద‌ళితుల‌పై పాము ప‌గ ప‌ట్టారు బాబు: ఎంపీ నందిగం

Webdunia
శనివారం, 31 జులై 2021 (19:26 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఈ రోజు బ్లాక్ డే అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టార‌ని అన్నారు. ఎన్నికల్లో తనను ఓడించారనే కక్షతో ఇలా దాడులు చేయిస్తున్నార‌ని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని, నిజంగా ఈ రోజు ఒక బ్లాక్ డే అని చెప్పారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ వంటి వారిని చంద్ర‌బాబు పరామర్శించడం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. 
 
నిజాయితీ రాజకీయాలు చేయాలంటే దళితుల వెనుక నిలవాలి కానీ చంద్రబాబు మాత్రం తన నైజాన్ని ఎన్నటికీ మార్చుకోడ‌న్నారు. ఇంక ఎన్ని ఎన్నికలు వచ్చినా దళితులు, బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈయన్ని నమ్మరు...ప్రతి వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్య‌బ‌ట్టారు.

మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు గొల్ల‌పూడికి వెళ్ళిన చంద్రబాబును అడ్డుకునేందుకు ద‌ళిత వ‌ర్గాలు అక్క‌డ ప్ర‌య‌త్నించాయి. అయితే, భారీ పోలీసు బందోబ‌స్తు వ‌ల్ల అది సాధ్యం కాలేదు. ఈ చ‌ర్య స‌రికాద‌ని, చంద్ర‌బాబు ద‌ళితుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఎంపీ నందిగం సురేష్ ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments