నూతన్ నాయుడు - మధుప్రియ మళ్లీ అరెస్టు...

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (09:50 IST)
విజయవాడలో ఓ దళిత యువకుడికి శిరోమడనం చేసిన కేసులో అరెస్టు అయిన టాలీవుడ్ చిత్ర నిర్మాత నూతన్ నాయుడు, ఆయన భార్య మధుప్రియలు మరోమారు అరెస్టు అయ్యారు. తొలుత శిరోమండన కేసులో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ దఫా ఓ మోసం కేసులో పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఉద్యోగాల పేరుతో తమ నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారంటూ తూర్పుగోదావరికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధుప్రియ బెయిలు నుంచి విడుదలైన కాసేపటికే మళ్లీ ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. 
 
కాగా, తన ఇంట్లో పనిచేసి మానేసిన దళిత యువకుడు శ్రీకాంత్‌కు ఆగస్టు 28న ఇంట్లోనే శిరోముండనం చేయించిన ఘటన అప్పట్లో రాష్ట్రంలో పెను సంచలనమైన విషయం తెల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ కేసులో తొలుత మధుప్రియతోపాటు మరికొందరిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న నూతన్ నాయుడును ఆ తర్వాత అరెస్టు చేశారు. తాజాగా, మధుప్రియ బెయిలుపై బయటకు రాగా, కాసేపటికే చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli : క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం అంటూ మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి పోస్ట్

Rana: కాంత తర్వాత దుల్కర్ సల్మాన్ ను నటచక్రవర్తి అని పిలుస్తారు: రానా దగ్గుబాటి

Mammootty: లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియంలో భ్రమయుగం ప్రదర్శన

Ramcharan: పెద్ది లోని చికిరి చికిరి సాంగ్ ..రహ్మాన్‌ పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది : రామ్ చరణ్

Katrina Kaif : మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. అభినందనల వెల్లువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments