Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే చైతన్య రథంపై హరికృష్ణ అంతిమయాత్ర..

మహానేత నందమూరి తారకరామారావు తనయుడు, సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకి స్నేహితుడి కుమారుడి పెళ్లికి వెళు

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (16:18 IST)
మహానేత నందమూరి తారకరామారావు తనయుడు, సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకి స్నేహితుడి కుమారుడి పెళ్లికి వెళుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.


తీవ్రగాయాలపాలైన హరికృష్ణ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కామినేని ఆస్పత్రి నుంచి హరికృష్ణ మృతదేహం మెహదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంది. 
 
గురువారం హరికృష్ణ పార్థివ దేహానికి అంత్యక్రియలు జరుగనున్నాయి. హరికృష్ణ అంత్యక్రియలు అందరికీ గుర్తుండేలా చేయాలని ఆయన కుమారులు భావిస్తున్నారు. అందుకే 1983 నాటి చైతన్య రథంపై హరిక‌ృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దివంగత సీఎం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 1983లో రాష్ట్రమంతటా ప్రచారం నిర్వహించిన చైతన్య రథంపై హరిక‌ృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
అప్పట్లో తండ్రి ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి అన్నీ తానై నడిపించారు హరికృష్ణ. ఆ చైతన్య రథానికి అప్పుడు హరికృష్ణే సారథిగా వ్యవహరించారు. ఇప్పుడు అదే రథంపై హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామక‌ృష్ణ సినీ స్టూడియోలో ఉన్న చైతన్యరథాన్ని అంతిమయాత్రకు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments