Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం విక్రయాలు

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (10:26 IST)
భారత రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో దేశంలోని ప్రముఖుల పేరిట స్మారక నాణేలను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. గత 1964 నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మంది ప్రముఖుల స్మారక నాణేలను ఆర్బీఐ విడుదల చేసింది. కానీ, విక్రయాలు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా సాగలేదు. కానీ, ఆగస్టు 28వ తేదీన ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీ.రామారావు స్మారక నాణెంను ఆర్బీఐ విడుదలైంది. 
 
ఈ నాణెం విడుదల చేసినప్పటి నుంచి విక్రయాలు భారీ మొత్తంలో కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి ఈ నాణేన్ని హైదరాబాద్ నగరంలోని మింట్‌ కౌంపౌండ్‌లో ముుద్రిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల ఎన్టీఆర్ స్మారక నాణేలను విక్రయించారు. భారత్‌లో ఇప్పటివరకు ఇదే గరిష్ట రికార్డు అని హైదరాదబాద్ మింట్ సీజీఎం వీఎన్ఆర్ నాయుడు వెల్లడించారు. గతంలో ఈ రికార్డు 12 వేల అమ్మకాలుగా ఉండగా, ఇపుడు ఇది రెండింతలకు పెరిగిందని వివరించారు. ఫలితంగా స్మారక నాణేల విక్రయంలో కూడా దివంగత ఎన్టీఆర్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. 
 
దీనిపై ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేరుతో ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం తథ్యమన్నారు. ఇప్పటివరకు దేశంలో వివిధ రంగాల ప్రముఖులు, వివిధ చారిత్రక ఘట్టాలపై 200 స్మారక నాణేలు విడుదల చేయగా, వాటిలో అత్యధికంగా అమ్ముడు పోయింది ఒక్క ఎన్టీఆర్ స్మారక నాణెం మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments