Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోరంకి అనుమోలు గార్డెన్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. చీఫ్ గెస్ట్‌గా రజనీకాంత్

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (10:56 IST)
స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్‌లో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. ఈ నెల 28వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా వెబ్‌‍సైట్, యాప్‌ను రూపకల్పన చేయగా, వీటిని ఆయన ఆవిష్కరిస్తారు. 
 
అలాగే, ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఎన్టీఆర్‌పై రాసిన తొలి పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఎస్. వెంకటనారాయణ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. మే 28వ తేదీన ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 
 
ఇందుకోసం టీడీ జనార్ధన్ నేతృత్వంలో ఒక సావనీర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా వెబ్‌సైట్, యాప్‌ను కూడా తీసుకునిరానున్నారు. ఈ రెండింటి ఆవిష్కరణ కార్యక్రమాలను హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తారు. 
 
అలాగే, ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలతో పాటు రెండు పుస్తకాలను, ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలతో ఓ పుస్తకం, బహిరంగ సమావేశాల్లో చేసిన ప్రసంగాల సంకలనంతో మరో పుస్తకం తీసుకునిరానున్నారు. చారిత్రక ప్రసంగాల పేరుతో తీసుకొచ్చే ఈ పుస్తకాలను ఈ నెల 28వ తేదీన పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఆవిష్కరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments