Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరంతా కరెంట్ తీసి.. మీడియా కన్నుగప్పి...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:29 IST)
ఎన్నారై జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరిని అత్యంత గోప్యంగా హైదరాబాద్‌కు రలించారు. ఆమెను తరలింపునకు ముందు హైదరాబాద్ నగరంలో హైడ్రామా చోటుచేసుకుంది. 
 
ఈ హత్య కేసులో ఆమెను అరెస్టు చేసిన తర్వాత ఆమెను కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఐదు రోజుల పాటు ఉంచారు. అయితే, ఈ హత్య హైదరాబాద్‌లో జరగడంతో ఆమెను హైదరాబాద్ పోలీసులకు అప్పగించాలని భావించారు. ఇందుకోసం శిఖా చౌదరి ఎవరి కంటా కనిపించకుండా ఉండాలా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. 
 
సోమవారం రాత్రి అత్యంత నాటకీయ పరిణామాలు, హైడ్రామా మధ్య రహస్య ప్రాంతానికి తరలించారు. ఊరంతా కరెంట్ తీసేసిన పోలీసులు, అంతకుముందే రెండు వాహనాలను స్టేషన్ ముందు సిద్ధం చేసివుంచారు. ఒక వాహనంలో శిఖాను ఎక్కించారు. ఏ వాహనంలో ఆమె ఉందో మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. 
 
ఆపై రెండు వాహనాల్లో ఒకటి విజయవాడవైపు, మరొకటి హైదరాబాద్ వైపు వెళ్లిపోయాయి. ఈ వాహనాలను మీడియా వెంబడించినా, ఆమె ఎందులో ఉందన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోయారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments