Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మామయ్యతో మజాకా.. రాకేష్‌తో రంజుగా డేటింగ్... శిఖా చౌదరి రాసలీలలు

Advertiesment
మామయ్యతో మజాకా.. రాకేష్‌తో రంజుగా డేటింగ్... శిఖా చౌదరి రాసలీలలు
, మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (14:00 IST)
ప్రముఖ ఎన్నారై, పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ జయరామ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు తర్వాత అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, జయరామ్‌ను రాకేష్ రెడ్డిని పరిచయం చేయించింది ఆయన మేనకోడలు శిఖా చౌదరే కావడం గమనార్హం. 
 
రాకేష్ రెడ్డి తీసుకున్న 4.50 కోట్ల రూపాయల రుణానికి వడ్డిని చెల్లించలేకపోవడంతో అసలు వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంపైనే రాకేష్ రెడ్డికి జయరామ్‌కు మధ్య విభేదాలు పొడచూపాయి. అదేసమయంలో రాకేష్ రెడ్డితో తన మేనకోడలు శిఖా చౌదరి డేటింగ్ చేయడాన్ని జయరామ్ జీర్ణించుకోలేక పోయాడు. ఈ విషయంపై కూడా రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తానని శిఖా చౌదరిని వదిలివేయాలని జయరామ్ షరతు కూడా విధించాడు. కానీ, ఆ డబ్బును చెల్లించలేక పోవడంతో జయరామ్‌ను రాకేష్ రెడ్డి హతమార్చాడు. 
 
ఆ తర్వాత ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా, శిఖా చౌదరికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. వారందరికీ విడాకులు ఇచ్చిన శిఖా.. ఓ రెస్టారెంట్‌లో శిఖా చౌదరితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య డేటింగ్‌కు దారితీసింది. అదేసమయంలో జయరామ్‌తో కూడా శిఖా చౌదరికి వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీన్ని జయరామ్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. అందుకే శిఖాను వదిలిపెట్టాలంటూ రాకేష్ రెడ్డితో జయరామ్ పలుమార్లు చెప్పినట్టు సమాచారం. అలాగే, శిఖ చౌదరికి మరికొందరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు లేకపోలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రలోనూ ఎన్నికల బడ్జెట్.. ఆదాయ వనరులు లేకపోయినా.. ఎన్నికల ముందు..?