Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో ఏపీలో 20 వేల ఉద్యోగాలా...? లోకేష్ రేయింబవళ్లు కృషి...

అమరావతి : త్వరలో 20 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరవాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. త్వరలో మరో 10 లక్షల మందికి

Webdunia
శనివారం, 28 జులై 2018 (21:24 IST)
అమరావతి : త్వరలో 20 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరవాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. త్వరలో మరో 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిరుద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. త్వరలో 20 వేల ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు.
 
అలాగే, 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి త్వరలో అందజేయనున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎన్జీవోలు, ఆర్.టి.సి ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామన్నారు. హోంగార్డులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పలు విభాగాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు జీతాలు పెంచామన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంతలా ఉద్యోగాల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం లేదన్నారు.  జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. దేశవిదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తున్నారన్నారు. 
 
పరిశ్రమల స్థాపన ద్వారా లక్షలాది ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐటీ కంపెనీల ద్వారా ఎందరికో ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. మరిన్ని ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయన్నారు. ఇంతలా కృషి చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ను అభినందించకపోయి, ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలన్నది ప్రతిపక్షాల కుట్ర అని విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని, అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. రక్షణ రంగాన్ని ప్రైవేటు పరం చేసిన ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వమన్నారు. 
 
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో రూ.45 వేల కోట్ల కుంభకోణం చోటుచేసుకుందన్నారు. త్వరలో మరెన్నో కుంభకోణాలు వెలుగులోకి రానున్నాయన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న నరేంద్ర మోడి ప్రభుత్వం ఇప్పటి వరకూ 20 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందన్నారు. ఉపాధి కల్పనలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంతో నరేంద్రమోడీ ప్రభుత్వానికి పోలికే లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే సీఎం చంద్రబాబునాయుడు మరోసారి గెలిపించాల్సిన అవసరం ప్రజలకుందన్నారు. బాబు వస్తేన జాబు వస్తుందన్న నినాదాన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిజం చేసిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments