ఎవరో ఏదో మాట్లాడినదానికి ఇండస్ట్రీకి సంబంధం లేదు...

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (20:02 IST)
ఏపీ స‌మాచార మంత్రి పేర్నినానితో స‌మావేశం అయిన త‌ర్వాత నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. గ‌త సంవత్సరం చిరంజీవి గారితో ప్రముఖులంతా సీఎం జ‌గ‌న్ ని కలిశార‌ని, ఆ త‌ర్వాత కోవిడ్ వ‌ల్ల కొంత గ్యాప్ వచ్చింద‌ని చెప్పారు. వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంద‌ని, సినిమా అనేది చాలా సున్నితమైనద‌ని ఆయ‌న ఆయ‌న వివ‌రించారు.

ఎలాంటి దుష్ప్రభావమైనా ముందు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఆ ప్రభావం పడుతుంద‌ని, ఇపుడు రెండు తెలుగు ప్రభుత్వాలు సానుకూల వాతావరణంలోనే ఉంద‌ని చెప్పారు. ఆన్ లైన్  టిక్కెటింగ్, ఆక్విపెన్సీ గురించి చర్చించామ‌ని తెలిపారు. మా సినిమాను వివాదం చేయవద్ద‌ని,  రాజకీయం వల్ల మా సినిమాకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, మీడియాపై ఉంద‌ని అన్నారు. ఎవరో ఏదో మాట్లాడిన దానికి ఇండస్ట్రీకి సంబంధం లేద‌ని, ప‌రోక్షంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కామెంట్స్ పై కౌంట‌ర్ ఇచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments