Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఏపీ సర్కారు స్పందన శూన్యం : కేంద్రం

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (08:11 IST)
విశాఖపట్టణంలో మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపించలేదని కేంద్రం తేల్చి చెప్పింది. అందువల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని కేంద్ర పట్ణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. 
 
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, నిజానికి వైజాగ్‌ మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించి పాలసీని గత 2017లోనే రూపొందించామన్నారు. కానీ, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాలేదన్నారు. పీపీపీ విధానంలో లైట్ రైల్ ప్రాజెక్టును నిర్మించాలని 2018లో నిర్మించాలని భావించామన్నారు. కానీ, ఏపీ సర్కారు లేదా మరో విదేశీ సంస్థల నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు.
 
కాగా, గత 2014-19 మధ్యకాలంలో ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో విశాఖపట్టణంతో పాటు విజయవాడ - గుంటూరు నగరాల మధ్య మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదన తెచ్చారు. మెట్రో మ్యాన్ శ్రీధరన్‌తో వైజాగ్‌లో మెట్రో రైల్ నిర్మించే సాధ్యాసాధ్యాలపై సర్వే కూడా చేయించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments