"ఛలో విజయవాడ"కు అనుమతి లేదు : పోలీస్ కమిషనర్ టాటా

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (14:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఉద్యోగులు ఈ నెల మూడో తేదీన ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
ఫిబ్రవరి 3వ తేదీ నిర్వహించనున్న ‘చలో విజయవాడ’ ప్రదర్శనకు విజయవాడ పోలీసులు అనుమతి నిరాకరించారు. అందువల్ల 3వ తేదీన నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు ఎవరికీ అధికారం లేదని ఆయన వెల్లడించారు. 
 
అయితే, ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేందుకు అనుకున్న విధంగా సమ్మెను కొనసాగించాలని ఉద్యోగులు కృతనిశ్చయంతో ఉన్నారు. పీఆర్సీ చెల్లింపు, అదనపు జీతానికి సంబంధించిన మూడు జీఓలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
 
ఇదే అంశంపై మంగళవారం సాయంత్రం మంత్రులు, అధికారులతో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు చర్చలు జరుపగా అవి కూడా విఫలమైన విషయం తెల్సిందే. దీంతో ముందుగా నిర్ణయించినట్టుగా ఈ నెల 3న ఛలో విజయవాడ, 7న నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. 

ఇందులోభాగంగా, ఫిబ్రవరి 3న విజయవాడలో తమ నిరసన కవాతు నిర్వహించాలని ఉద్యోగులు కృతనిశ్చయంతో ఉండగా, పోలీసులు అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. సభను అడ్డుకునేందుకు ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం నుంచి నేతలను గృహనిర్భందంలో ఉంచాలని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments