Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు జీతాలు పెంచలేం.. తేల్చేసిన ఏపీ ప్రభుత్వం

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెలుగు పరిధిలో పనిచేస్తున్న మండల సమాఖ్య క్లస్టర్‌ కోఆర్డినేటర్ల (ఎంఎస్‌సీసీ) ఆశలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వేతనాలు పెంచలేమని తేల్చి చెప్పేసింది. ఎఫ్‌టీఈ హెచ్‌ఆర్‌ పాలసీలోకి తీసుకురావడమూ కుదరదని తేల్చిచెప్పింది.
 
ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఈ నెల 4వ తేదీన మెమో జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌సీసీలు 1100 మంది వరకున్నారు. దీనిపై సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ వివరణ కోరగా సంబంధిత దస్త్రం తమకు ఇంకా చేరలేదని అన్నారు.
 
ఎంఎస్‌సీసీలు, అకౌంటెంట్లకు వేతనాలు పెంచుతామని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలుచేయిస్తామని వెలుగు, వైకేపీలో పనిచేస్తున్న కొంతమంది నుంచి పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని ఓ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలొచ్చాయి.
 
పలువురి వద్ద రూ.20 వేల నుంచి రూ.36 వేల వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. పని అయ్యే వరకు విషయాన్ని ఎక్కడా బయటపెట్టొద్దని సంబంధిత సంఘం నాయకుడు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా వివరించడం అప్పట్లో వైరల్‌ అయింది. దీంతో వసూళ్ల బాగోతం వెలుగుచూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments