Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమేజ్ కోసం ఇవాంకాను పిలిస్తే.. అమరావతికి రానన్నారట..

హైదరాబాదులో జరుగనున్న సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాను అమరావతికి తీసుకొచ్చేందుకు ఏపీ సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇవాంకా ఏపీకి వస్తే తమ రాష్ట్ర

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (12:25 IST)
హైదరాబాదులో జరుగనున్న సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాను అమరావతికి తీసుకొచ్చేందుకు ఏపీ సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇవాంకా ఏపీకి వస్తే తమ రాష్ట్ర ఇమేజ్ పెరుగుతుందని.. అమెరికా నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు భావించారట. 
 
ఇందులో భాగంగా ఇవాంకా ఏపీకి వస్తానని అంగీకరిస్తే.. అమరావతిలో కానీ, విశాఖలో కానీ భారీ వేడుక నిర్వహించాలని ఆలోచించారట. కానీ భద్రతా కారణాల దృష్ట్యా.. షెడ్యూల్‌లో లేని కార్యక్రమాలకు ఇవాంకాను అనుమతించేది లేదని అమెరికా అధికారులు తేల్చి చెప్పేశారట. దీంతో చంద్రబాబు ఆహ్వానాన్ని ఇవాంకా కూడా తిరస్కరించినట్లు తెలుస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. గ్లోబల్ ఎంటర్‌ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌కు హాజరు కానున్న వైట్ హౌస్ సలహాదారు, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాకు, ప్రధాని నరేంద్ర మోదీకి, సదస్సుకు హాజరయ్యే ఇతర కేంద్ర మంత్రులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనమైన కానుకలు ఇవ్వనున్నారు. ఇవాంకాకు ఛార్మినార్ నమూనాను బహుమతి ఇవ్వనున్నారు. 
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాకతీయ కళాతోరణం నమూనాను రాష్ట్ర గుర్తింపుగా ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ఇవాంకాకు ప్రత్యేకంగా గొల్లభామ చీరతో పాటు, ముత్యాలు, గాజులను కూడా బహుమతులుగా అందించనున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు వీణ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు నెమలి ప్రతిమలను ఇచ్చి సత్కరించనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments