తేలిపోయింది... ఇక 2019లో తెదేపాకు ఛాన్సే లేదు... రోజా ట్వీట్స్

నిన్న లోక్ సభలో గల్లా జయదేవ్, తెదేపా ఎంపీలు చేసిన డ్రామాతో ఇక 2019లో తెలుగుదేశం పార్టీకి ఛాన్సే లేదని తేలిపోయింది. ఏపీకి సాధించుకోవాల్సిన హక్కులను రాబట్టడంలో వారు పూర్తిగా విఫలమయ్యారు. ఏపీకి ఇక అవసరమైన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ రోజా ట్వీట్

Webdunia
శనివారం, 21 జులై 2018 (20:56 IST)
నిన్న లోక్ సభలో గల్లా జయదేవ్, తెదేపా ఎంపీలు చేసిన డ్రామాతో ఇక 2019లో తెలుగుదేశం పార్టీకి ఛాన్సే లేదని తేలిపోయింది. ఏపీకి సాధించుకోవాల్సిన హక్కులను రాబట్టడంలో వారు పూర్తిగా విఫలమయ్యారు. ఏపీకి ఇక అవసరమైన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ రోజా ట్వీట్ చేశారు.
 
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పూర్తిగా బెడిసికొట్టిందని బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ ఆరోపించారు. అవిశ్వాసం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాసం వీగిపోవడం ద్వారా టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పరువును తెలుగుదేశం పార్టీ బజారుకు ఈడ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీడీపీ మైత్రీ బంధానికి లోక్‌సభ వేదికగా నిలిచిందని విమర్శించారు. 
 
త్వరలో టీడీపీలో తిరుగుబాటు మొదలవుతుందన్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అసత్యాలు సభలో ప్రస్తావించారని ఆరోపించిన ఆయన... ఆర్థిక మంత్రికి సన్మానం, అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీ రాజీపడదని... ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని ఆనయ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments