Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విజయవాడకు నిర్మలా సీతారామన్ .. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (07:30 IST)
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా నేడు విజయవాడలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.25 నిమిషాలకు చెన్నయ్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడనుండి గన్నవరం విమానాశ్రయం చేరుకుని జక్కుల నెక్కలం,గూడవల్లి సర్కిల్ దగ్గర  నందు వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులను కలసి మాట్లాడతారు.

అనంతరం నేరుగా విడిది గృహానికి చేరుకొని మధ్యాహ్నం 3.00 గంటలకు కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం  నేరుగా సాయంత్రం  4 గంటలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పక్కన గల ది వెన్యూ కన్వెన్షన్ హాల్ కు చేరుకొని భాజపా ఏర్పాటు చేసిన కార్యక్రమం "చట్టం చేయబడిన వ్యవసాయ బిల్లు పై రైతులు,వ్యవసాయరంగ నిపుణులతో చర్చా కార్యక్రమం" లో పాల్గొని వారి ఉద్దేశాలను మీడియాకు వివరిస్తారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, సహా ఇంచార్జి సునిల్ దేవధర్, జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎన్. మధుకర్ జీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్, ఎస్.విష్ణు వర్ధన్ రెడ్డి, వేటుకూరి సూర్యనారాయణ రాజు, లోకుల గాంధీ, కోశాధికారి, కార్యాలయ ఇంచార్జి వి.సత్యమూర్తి పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments