విజయవాడ నగరంలో రోజుకు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే క్రమములో చేపల మార్కెట్ ల వద్ద అధిక రద్దీ ఉంటున్న దృష్ట్యా నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారి ఆదేశాలననుసరించి ది. 27-09-2020న ఆదివారం నగరంలో అన్ని చేపల మార్కెట్లను మూసి వేయుటం జరుగుతుందని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా.రవి చంద్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు.
నగరపాలక సంస్థ పరిధిలోని బెసెంట్ రోడ్ మహంతి మార్కెట్, కొత్తపేట, చిట్టినగర్, సింగ్ నగర్, పాయకాపురం, రామలింగేశ్వర నగర్, రాణిగారి తోట మొదలగు ప్రాంతాలలో గల చేపల మార్కెట్లను పూర్తిగా మూసివేయుట జరుగుతుందని తెలియజేసారు.
నగర వీదులలో చికెన్, మటన్ విక్రయాల దారులు అధికారులతో సహకరించి covid నిబంధనలు పాటిస్తూ, వినియోగదారులు విధిగా సామజిక దూరం పాటించేలా చూడాలని మరియు మాస్క్ లు, శానిటైజర్ అందుబాటులో ఉంచి పరిశుభ్రమైన వాతావరణంలో ఉదయం గం. 6.00 నుండి 11.00 గంటల వరకు మాత్రేమే విక్రయాలు చేసుకోవాలని అన్నారు.
సమయం పాటించకుండా వ్యాపారం కొనసాగించిన వారిపై కఠిన చర్యలు తిసుకోనబడునని, అటువంటి షాపులను సిజ్ చేయుట జరుగుతుందని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా రోడ్ల పై చేపలు, రొయ్యలు మొదలగు వాటిని విక్రయించిన యెడల అట్టి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
చికెన్ షాపుల వారు వ్యాది సోకిన/ చనిపోయిన కోళ్ళు విక్రియించరాదని అట్లు విక్రయాలు సాగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారి యొక్క షాపు లైసెన్స్ రద్దు పరచుట జరుగునని హెచ్చరించారు.