Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టం

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (09:18 IST)
టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మునిసిపల్‌ కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.

ఇటీవల మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్ర పటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్‌ గదిలోకి మార్చారు. విషయం తెలిసిన మాజీ మంత్రి ఆ ఫొటోను యథాస్థానంలో ఉంచాలంటూ మునిసిపల్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

ఆ సమయంలో మునిసిపల్‌ కమిషనర్‌ టి. కృష్ణవేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయడంతోపాటు ఐపీసీ సెక్షన్‌ 354-(4), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 క్రింద కూడా కేసు నమోదు చేసినట్లు స్థానిక సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ తెలిపారు.

అలాగే, కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. కాగా, అయ్యన్నను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments