ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. 'ఇంట్లో పబ్జీ... అసెంబ్లీలో లాలిజో' అంటూ హేళన చేశారు.
జగన్ మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో నిద్రపోతూ కనిపించిన దృశ్యాలతో వీడియోను లోకేశ్ ట్వీట్ చేశారు.
గత సమావేశాల్లోనూ ఇలాగే నిద్రపోయాడని, ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నాడనే అర్థం వచ్చేలా 'జగన్ అనే నేను అసెంబ్లీలో...' అనే శీర్షికతో వీడియో రూపొందించారు.