Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదుపులోకి రాని కరోనా - ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడగింపు

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (12:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోమారు రాత్రిపూట కర్ఫ్యూను పొడగించింది. ఇది ఈ నెల 21వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేర‌కు ఈ రోజు ఉద‌యం ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.
 
కాగా, ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు అదుపులోకి రావ‌ట్లేదు. దీనిపై నిన్న స‌ర్కారు సమీక్ష స‌మావేశం నిర్వహించి, రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి స‌మ‌యంలో క‌రోనా ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది.
 
ఇదిలావుంటే, శనివారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్ మేరకు... గడచిన 24 గంటల్లో 69,088 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,535 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. 
 
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 299 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 237, నెల్లూరు జిల్లాలో 211 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 8 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
 
అదేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2,075 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 13,631కి పెరిగింది. 
 
రాష్టంలో నేటివరకు మొత్తం 19,92,191 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,60,350 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 18,210 మంది చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments