Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సారి కందిపప్పు స్థానంలో శనగపప్పు: మంత్రి కొడాలి నాని

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (08:44 IST)
రాష్ట్రంలో 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే రెండవ విడత ఉచిత రేషన్ కు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాలు,  వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఈ నెల 13వ తేదీ నాటికి గోదాముల నుండి రేషన్ షాపులకు నిత్యవసర సరుకులను సరఫరా చేస్తామన్నారు.

గత నెల 29వ తేదీ నుండి మొదటి విడత రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఒక కోటి 18 లక్షల ఒక వెయ్యి 827 రేషన్ కార్డులకు నిత్యావసరాలను సరఫరా చేశామని, ఈనెల 14వ తేదీ వరకు పంపిణీ జరుగుతుందన్నారు. 15 వ తేదీ నుండి జరిగే రెండో విడత రేషన్ పంపిణీలో కార్డులోని ప్రతి ఒక్కరికి ఐదు కేజీల చొప్పున బియ్యం, ఈసారి కందిపప్పు స్థానంలో ప్రతి రేషన్ కార్డుకు కేజీ శనగపప్పును ఉచితంగా అందజేస్తామన్నారు.

రేషన్ షాపుల్లో రద్దీ నియంత్రణకు ఈసారి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాలంటీర్ల ద్వారా కూపన్ లను జారీ చేస్తామన్నారు. కూపన్ ల  వారిగానే రేషన్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులను తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులను సరఫరా చేస్తామన్నారు. పేద ప్రజల ఆకలి బాధలను తీర్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రి కొడాలి నాని చెప్పారు.

కాగా ఆదివారం రాష్ట్రంలోని 6 లక్షల 25 వేల 567 రేషన్ కార్డులకు 10 వేల 874 మెట్రిక్ టన్నుల బియ్యం, 706 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని మంత్రి శ్రీ కొడాలి నాని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 47 లక్షల 24 వేల 017 రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. వీటిలో ఇప్పటి వరకు ఒక కోటి 18 లక్షల 01 వేల 827 రేషన్ కార్డులకు మొత్తం ఒక లక్ష 89 వేల 601 మెట్రిక్ టన్నుల బియ్యం, 10 వేల 960 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు.
 
 అనంతపురం జిల్లాలో 12 లక్షల 23 వేల 684 రేషన్ కార్డులు ఉండగా ఇప్పటి వరకు 9 లక్షల 98 వేల 689 రేషన్ కార్డులకు 17 వేల 454 మెట్రిక్ టన్నుల బియ్యం, 759 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో 11 లక్షల 33 వేల 535 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 9 లక్షల 86 వేల 581 రేషన్ కార్డులకు 17 వేల 090 మెట్రిక్ టన్నుల బియ్యం, 977 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలో 16 లక్షల 50 వేల 254 రేషన్ కార్డులు ఉండగా, వీటిలో 13 లక్షల 35 వేల 445 రేషన్ కార్డులకు 20 వేల 296 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 1, 052 మెట్రిక్ టన్నుల కందిపప్పును సరఫరా చేశామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 14 లక్షల ఎనభై తొమ్మిది వేల 439 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 12 లక్షల 31 వేల 800 రేషన్ కార్డులకు 18 వేల 926 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 204 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. 
 
కడప జిల్లాలో 8 లక్షల 02 వేల 039 రేషన్ కార్డు లు ఉండగా, వీటిలో 6 లక్షల 64 వేల 878 రేషన్ కార్డులకు 11 వేల 124 మెట్రిక్ టన్నుల బియ్యం, 661 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని పేర్కొన్నారు. కృష్ణాజిల్లాలో 12 లక్షల 92 వేల 937 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 10 లక్షల 58 వేల 293 రేషన్ కార్డులకు 16 వేల 378 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 043 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. 
 
కర్నూలు జిల్లాలో 11 లక్షల 91 వేల 344 రేషన్ కార్డు ఉండగా, వీటిలో 8 లక్షల 97 వేల 450 రేషన్ కార్డులకు 15 వేల 140 మెట్రిక్ టన్నుల బియ్యం, 873 మెట్రిక్ టన్నుల కంది పప్పును సరఫరా చేశామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 9 లక్షల 04 వేల 220 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 7 లక్షల 293 రేషన్ కార్డులకు 10 వేల 735 మెట్రిక్ టన్నుల బియ్యం, 561 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామన్నారు. 
 
ప్రకాశం జిల్లాలో 9 లక్షల 91 వేల 822 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 7 లక్షల 91 వేల 528 రేషన్ కార్డులకు 12 వేల 471 మెట్రిక్ టన్నుల బియ్యం, 785 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 8 లక్షల 29 వేల 024 రేషన్ కార్డు లు ఉండగా, వీటిలో 5 లక్షల 48 వేల 672 రేషన్ కార్డులకు 8 వేల 686 మెట్రిక్ టన్నుల బియ్యం, 524 మెట్రిక్ టన్నుల కందిపప్పును సరఫరా చేశామని తెలిపారు. 
 
విశాఖపట్నం జిల్లాలో 12 లక్షల 45 వేల 266 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 9 లక్షల 36 వేల 453 రేషన్ కార్డులకు 14 వేల 735 మెట్రిక్ టన్నుల బియ్యం, 884 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని చెప్పారు. విజయనగరం జిల్లాలో 7 లక్షల 10 వేల 528 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 5 లక్షల 94 వేల 920 రేషన్ కార్డులకు 10 వేల 294 మెట్రిక్ టన్నుల బియ్యం, 592 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామన్నారు. 
 
పశ్చిమగోదావరి జిల్లాలో 112 లక్షల 59 వేల 925 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 10 లక్షల 56 వేల 825 రేషన్ కార్డులకు 16 వేల 267 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 039 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని మంత్రి శ్రీ కొడాలి నాని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments