Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అధినేత మార్కులు కొట్టేయడానికి రెచ్చిపోతున్నారు : మంత్రి కొడాలి నాని

అధినేత మార్కులు కొట్టేయడానికి రెచ్చిపోతున్నారు : మంత్రి కొడాలి నాని
, శుక్రవారం, 13 డిశెంబరు 2019 (15:51 IST)
అధ్యక్షా గురువారం సభ ప్రారంభమవుతూనే స్పీకర్‌ ఛైర్‌ మీద దాడికి అన్నట్టుగానే గౌరవ ప్రతిపక్ష సభ్యులు కొంతమంది దురుసుప్రవర్తన చేశారని మనం అనుకున్నాం. కానీ ఇంతకంటే ఘోరంగా సభా ప్రాంగణం లోపలే కొంతమంది సభ్యులు శాసనసభలో పనిచేసేటటు వంటి అధికారులు మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ప్రవర్తించారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. 
 
ఆయన శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, ఈ సభలో బాధ్యత కలిగినటువంటి సభ్యులుగా వహరించాల్సినంటువంటి తీరులో కాకుండా భిన్నమైన తీరులో, సమాజంలో నేరప్రవృత్తి ఉన్న వ్యక్తుల తీరు ఏ రకంగా ఉంటుందో అంతకంటే ఘోరంగా వారు ప్రవర్తింటినటువంటి తీరు ఉంది. సహజంగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయుకుడైనా వారించాల్సింది పోయి ... అధ్యక్షా మనకున్నటువంటి రూల్స్‌ ప్రకారం సభ్యులు తప్ప వేరొకరెవరూ సభ జరుగుతున్న సమయంలో లోనికి రావడానికి వీల్లేదు.

కానీ సభ్యులెవరో, సభ్యులు కానిదెవరో తెలియకుండా ఓ 50-60 మంది సమూహంగా వస్తున్నప్పుడు, సహజంగా శాసనసభకు సంబంధించిన భద్రతా సిబ్బంది గేటు మూసి ఎవరు శాససనభ సభ్యులైతే వారిని లోనికి తీసుకోవడం అనేది రూల్‌. అది ఎవరి ప్రభుత్వం ఉన్నా, ఎవరూ స్పీకర్‌గా ఉన్నా జరిగే రూల్‌ అది. దానికి గేటు వేసిన దానికి కొంతమంది సభ్యులు ఒరే ఎవడ్రా... రాస్కెల్, ఈడియట్‌, యూజ్‌లెస్‌ఫెలో ఇటువంటి పదాలు నిజంగా దురదృష్టం
వారి నాయకుడే సభా మర్యాదను మర్చిపోయి, సంస్కారాన్ని మర్చిపోయి ఇటువంటి పదజాలం వాడుతున్నప్పుడు సభ్యులు కూడా అంతే కదా. 
 
నిన్న జరిగిన తీరంతా చూస్తుంటే ఎవరికి వారు వారి నాయకుడు దగ్గర మార్కులు కొట్టేయాలన్నంతగా బజారుతనంతో ప్రవర్తించినట్టుగా అధికారులని నెట్టివేసి, మేన్‌ హేండిల్‌ చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 
 
ఇందులో దీపక్‌ రెడ్డి అనే కౌన్సిల్‌ సభ్యుడు వారి మీద కాని, సభలో ఇక్కడెక్కడో తిరుగుతున్న ఆయన రామానాయుడు మీద కాని చర్యలు తీసుకోవాలి. వీరు చేసినటువంటి దుర్మార్గం అలాంటిది. మామూలుగా అయితే బయట కరణం బలరాంకి దూకుడుగా ఉంటారని పేరు, వయస్సులో పెద్దవారైనా వారు వీళ్లని బతిమాలుతున్నారు తప్పు, తప్పు అలా వెళ్లకూడదని ఒకసారి కొట్టింది కాదు, రెండోసారి కూడా లోకేష్‌ అనే ఎమ్మెల్సీ దూకుడుగా చీఫ్‌ మార్షల్‌ మీద కొట్టడానికి వెళ్తున్నారు. ఒకాయన మార్షల్‌ని పీక పట్టుకున్న పరిస్ధితి. ఒకాయన్ని గోళ్లతో రక్కిన పరిస్ధితి. ఇంకొకాయన్ని నుదుటి మీద గుద్దిన పరిస్ధితి. ఈ ఫోటోలు చూస్తే ఎవరు తోస్తున్నారో, ఎవరు ఎవర్ని కొట్టారో అర్ధమవుతుంది చూడండి అధ్యక్షా. 
 
వీళ్లంతా బావి నాయకుడు, బావి ముఖ్యమంత్రి, మా పార్టీని అతనే నడుపుతాడని చెపుతున్నారు, కొంతమంది కలలు కన్నారు, కొంతమంది బాధపడుతున్నారు. అతగాడి చర్య చూడండి అధ్యక్షా పీక పట్టుకుని నులుపుతున్నాడు మార్షల్‌ని (ఎమ్మెల్సీ లోకేష్‌ని ఉద్దేశించి) గ్రాఫిక్స్‌ అలవాటు అయిన వాడికి అంతా గ్రాఫిక్స్‌గానే కనిపిస్తాయి. పచ్చకామెర్ల వాడికి అంతా పచ్చకామెర్లుగానే కనిపిస్తాయి. ఈ ఫోటోలన్నీ గ్రాఫిక్స్‌ అంటున్నారు మీరు అనుమతిస్తే వీడియో కూడా ఉంది. అది కూడా ప్రదర్శిద్దాం మీకు ద్వారా నేను కోరుకునేది వీరందరి మీదా(విపక్ష సభ్యులు) తక్షణమే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి. 
 
మనకోసం నిద్రాహారాలు మాని, గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని అసెంబ్లీ కట్టిన చోట మన భద్రత కోసం డ్యూటీ చేస్తున్న వ్యక్తులు మీద ఈ రకంగా దాడి చేస్తే, చర్య తీసుకోకుండా ఊరుకోవడం అనేది సరికాదు. అసెంబ్లీలో నిన్న జరిగిన ఉదంతంపై చర్చ సందర్భంగా జోక్యం చేసుకున్న స్పీకర్‌ నిన్న అంతా జరిగిన తర్వాత ఆ ఎపిసోడ్‌ మీద నేనంతా ఎగ్జామిన్‌ చేసి ఐ విల్‌ టేక్‌ యాక్షన్‌ అన్నాను, నిన్న రామనారాయణరెడ్డి ఇచ్చినటువంటి దాని మీద కూడా ఎధిక్స్‌ కమిటీకి రిఫర్‌ చేశాం, దీని మీద వాట్‌ యాక్షన్‌ వుయ్‌ ఆర్‌ గోయింగ్‌ టూ టేక్‌ అనే దాని మీద కన్సెడర్‌ చేసి యాక్షన్‌ తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మండలి ఛైర్మన్‌కు తెదేపా సభ్యుల ఫిర్యాదు