మండలి ఛైర్మన్‌కు తెదేపా సభ్యుల ఫిర్యాదు

శుక్రవారం, 13 డిశెంబరు 2019 (15:44 IST)
శాసన మండలికి వస్తుంటే మార్షల్స్ తమను అడ్డుకున్నారని మండలి ఛైర్మన్‌కు తెలుగుదేశం సభ్యులు ఫిర్యాదు చేశారు. తమవద్ద వున్న వీడియోను ఛైర్మన్‌కు పంపిన తెలుగుదేశం సభ్యులు. తెలుగుదేశం సభ్యులు తీసిన వీడియోను శాసనమండలిలో ప్రదర్శించటానికి రూలింగ్ ఇచ్చిన శాసనమండలి ఛైర్మన్. 
 
అయితే, తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వీడియోను ఎలా ప్రదర్శిస్తారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. శాసనసభ ప్రాంగణంలో ఉన్న కెమెరాలులో నుంచి వీడియో సేకరించి ప్రదర్శించాలని అని కోరిన బొత్స సత్యనారాయణ. 
 
తెలుగుదేశం సభ్యుడికి అవమానం జరిగితే... ఏ టైంలో జరిగింది... ఎక్కడ జరిగింది... అన్ని వివరాలు సేకరించి ప్రాంగణంలో ఉన్న కెమెరాలు నుంచి వీడియో తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వీడియో ప్రదర్శించి సభలో కొత్త సాంప్రదాయాలను కొనసాగించవద్దని సూచించిన మంత్రి శాసనసభలో ప్రదర్శించిన వీడియోతో పాటు తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వీడియోను 11 గంటల 45 నిమిషాలకు శాసనమండలిలో ప్రదర్శిస్తామని ప్రకటించిన మండలి చైర్మన్. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చంద్రబాబు సుదీర్ఘమైన అనుభవం తిట్టడానికా? మంత్రి కన్నబాబు