రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మీడియా సృష్టే : గంటా శ్రీనివాస రావు

గురువారం, 5 డిశెంబరు 2019 (15:28 IST)
రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మీడియా సృష్టేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ముందు, ఆ తర్వాత పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతూనే వుందన్నారు. 
 
తనను నిరంతరం వార్తల్లో వుంచుతున్న మీడియాకు కృతజ్ఞతలు. నేను నరేంద్రమోడీతో కలిసి తీసుకున్న ఫోటో నిజమే. అది మోడీ గుజరత్ సిఎంగా ఉన్నపుడు తీసిన ఫోటో. నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వున్నప్పటిది. దానిని ఇప్పుడు వైరల్ చేశారని చెప్పారు. 
 
ఇప్పటికే నాలుగైదు ముహూర్తాలు మీరే పెట్టేశారు.... నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు చెప్తానని అనేకసార్లు స్పష్టం చేశాను. ఫంక్షన్లలో ఇతర పార్టీల వ్యక్తులను కలుస్తుంటాం. వాటిని రాజకీయాలతో ముడిపెట్టలేం. 
 
అమిత్ షా గురించి పవన్ చేసిన కామెంట్స్.... బీజేపీ మంచిది అన్నాడో.... బీజేపీకి దగ్గర అవ్వాలని అన్నాడో ఆయననే అడగాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉత్తర నియోజకవర్గానికి ఎంత చేయగలనో, అంతే చేస్తున్నా అని గంటా శ్రీనివాస రావు చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఎయిడ్స్ బారిన బాధితురాలు