Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షానికి అండ‌ర్ బ్రిడ్జిలో నీరు... పెళ్లి కూతురు బలి

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (10:30 IST)
శుక్ర‌వారం అర్ధ‌రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ న‌వ వ‌ధువు బ‌లి అయిపోయింది. తిరుపతి బాలాజీ కాలనీ నుండి యం.ఆర్.పల్లి కి వెళ్లే దారిలో వెంగమాంబ కూడలి(వెస్ట్ చర్చ్) వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నీళ్లు 8 ఆడుగులకు పైగా నిలబడిపోయాయి. లోతు తెలియని సుమో పెళ్లి వాహనం దాటుకుని వెళ్లొచ్చు అనుకొన్న డ్రైవర్ నీళ్లలోకి వేగం వెళ్ల‌గా మ‌ధ్య‌లో సుమో ఆగిపోయింది. అప్పటికే సుమో మునిగిపోయేటంత లోతులోకి వెళ్లడంతో ఊపిరి ఆడక అందులోని పెళ్లి కూతురు అక్కడికక్కడే వాహనంలోనే  చనిపోయింది. మ‌రో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ సంఘటన రాత్రి సుమారు 1:30 పైన జరిగింది.. ఆ నీటిలో ఒక లారీ కూడా మునిగిపోయింది. వెస్ట్ చర్చి వద్ద  అండర్ బ్రిడ్జి లోకి భారీగా చేరుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. పెద్ద వ‌ర్షం కుర‌వ‌డంతో 8 అడుగులు లోతు నీరుంది. ఈ నీటికి ఊపిరి ఆడ‌క సుమోలో చిక్కుకున్న ఏడుగురు న‌ర‌క‌యాత‌న ప‌డ్డారు. నవ వధువు సంధ్య అక్క‌డిక‌క్క‌డే సీట్లో కూర్చుని అలాగే మృతి చెందింది. మరో చిన్నారికి అస్వస్థతగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ఎస్ వి యూనివర్సిటీ పోలీసులు వ‌చ్చి కాపాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments