Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ వ్యక్తితో చాటింగ్ చేస్తూ విడాకులు కోరింది.. అందుకే భార్యను చంపి ముక్కలు చేసి తగులబెట్టా : భర్త రూపేశ్

ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నేళ్లు కాపురం చేశాక.. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ ఫ్రెంచ్ వ్యక్తితో చాటింగ్ చేస్తూ గడిపేది. ఇదే విషయంపై ప్రస్తావిస్తే.. గొడవకు దిగి విడాకులు కోరింది.

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (12:53 IST)
ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నేళ్లు కాపురం చేశాక.. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ ఫ్రెంచ్ వ్యక్తితో చాటింగ్ చేస్తూ గడిపేది. ఇదే విషయంపై ప్రస్తావిస్తే.. గొడవకు దిగి విడాకులు కోరింది. దీన్ని తట్టుకోలేకే భార్యను గొంతుపిసికి చంపేసి.. ముక్కలు ముక్కలు చేసి పెట్రోల్ పేసి కాల్చిపారిసేనట్టు నిందితుడైన భర్త పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
రూపేశ్ అనే వ్యక్తి 8 ఏళ్ల క్రితం సింథియా అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకుని హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఈయన భార్య మరో వ్యక్తి (ఫ్రెంచ్)తో ఫేస్‌బుక్‌ చాటింగ్‌ చేయసాగింది. దీన్ని గమనించి మందలించడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భర్త వేధింపులు తట్టుకోలేని సింథియా విడాకులు కావాలని పలుమార్లు ఒత్తిడి చేసింది. దీంతో భార్యాభర్తల మధ్య రోజు రోజుకు గొడవలు ఇంట్టో గొడవలు పెరగాయి. 
 
దీంతో కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఇందులోభాగంగా సోమవారం ఉదయం ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, సూట్‌ కేసులో పెట్టి కారులో తీసుకువచ్చి శంషాబాద్‌ మండలం మదన్‌పల్లి సమీపంలోని గ్రీన్‌సిటీ వెంచర్‌లో కూతురు ఎదుటే పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నంలో అతని కారు బురదలో కూరుకుపోయింది. దీంతో స్థానికులు సహాయం కోరాడు. వారు మనిషిని కాల్చిన వాసనను పసిగట్టి రూపేశ్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద జరిపిన విచారణలో అనేక విషయాలు వెల్లడించాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments