Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనామా పేపర్ల వేడి తగ్గింది.. స్వచ్ఛ భారత్ ప్రచారకర్తగా అమితాబ్?!

పనామా పేపర్స్ తొలి పత్రాల్లోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబీకుల పేర్లు వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించాయి. పనామా పేపర్స్ ప్రభావం కారణంగా అమితాబ్, ఐశ్వర్యారాయ్ పేర్లు కూడా నల్లధనం విషయంలో హల్

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (12:42 IST)
పనామా పేపర్స్ తొలి పత్రాల్లోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబీకుల పేర్లు వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించాయి. పనామా పేపర్స్ ప్రభావం కారణంగా అమితాబ్, ఐశ్వర్యారాయ్ పేర్లు కూడా నల్లధనం విషయంలో హల్ చల్ చేశాయి. కొద్ది వారాలుగా ఈ విషయంపై మీడియాలో వార్తలు సద్దుమణగడంతో.. ఇన్ క్రెడిబుల్ ఇండియాకు ప్రచారకర్తగా ఉండాల్సిన బిగ్ బీ కేవలం పనామా పేపర్లు సృష్టించిన సునామీ వల్ల ఆ అవకాశాన్ని పొగొట్టుకున్నారు. 
 
ప్రస్తుతం బిగ్ బీని స్వచ్ఛ భారత్ ప్రచారానికి ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రచారంలో భాగస్వామి కావాలంటూ అమితాబ్‌ బచ్చన్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. ఇక స్వచ్ఛభారత్ ప్రచారకర్తగా వ్యవహరించేందుకు అమితాబ్ ఒప్పుకుంటారో లేదో అనేది తెలియాల్సి వుంది.
 
కాగా స్వచ్చభారత్ పథకంపై ఇప్పటికే దేశ ప్రజల్లో మంచి అవగాహన వచ్చినప్పటికీ.. గ్రామాల్లో స్వచ్ఛ భారత్ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అమితాబ్‌ను నియమించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు అమితాబ్ అంగీకరిస్తే., జింగిల్స్, రేడీయాలో ప్రకటనలు, పోస్టర్లతో స్వచ్ఛ భారత్ పథకాన్ని మరింత ముందుకు దూసుకెళ్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. 

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments