Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త కరెన్సీ నోట్లు ఉంటే రూ.18 వేలకే తులం బంగారం... రూ.కోట్ల దోపిడీ

కొత్త నోట్ల దందా సరికొత్త దోపిడీలకు, మోసాలకూ దారితీస్తోంది. ఈ ముఠాకు పోలీసులు సైతం చేతుల కలిపారు. దీంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ టప్పాచబు

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (14:47 IST)
కొత్త నోట్ల దందా సరికొత్త దోపిడీలకు, మోసాలకూ దారితీస్తోంది. ఈ ముఠాకు పోలీసులు సైతం చేతుల కలిపారు. దీంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ టప్పాచబుత్ర ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, కాంగ్రెస్ నేత తిరుమల్లేష్ నాయుడు ఇద్దరూ పాత, కొత్త కరెన్సీ నోట్లను తమకు అనుకూలంగా మలచుకునే ఎత్తుగడ వేశారు. 
 
పాత నోట్ల మార్పిడి కోసం వచ్చేవారిని దోచుకున్నా.. కేసుల భయంతో వారు ఫిర్యాదు చేసే అవకాశం లేదని రాజశేఖర్ చెప్పడంతో తిరుమల్లేష్ తన అనుచరులతో రంగంలోకి దిగాడు. కొత్త నోట్లు తెస్తే తులం బంగారాన్ని 18 వేలకే ఇస్తామంటూ ముమ్మరంగా ప్రచారం చేయించాడు. దీన్ని వెంకటబాబా అనే వ్యక్తి దీన్ని నమ్మి తిరుమల్లేష్‌ను సంప్రదించాడు.
 
ఆయన తన మిత్రులతో కలిసి రూ.25 లక్షలతో ఫిలింనగర్‌లోని సాయి గెస్ట్ హౌస్‌కు చేరుకోగా.. అక్కడ తిరుమల్లేష్ వారిని బెదిరించి రూ.12.5 లక్షలు తీసుకుని పంపేశాడు. ఇందులో రాజశేఖర్ ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. తమ మొదటి దందా సక్సెస్ కావడంతో వీళ్ళిద్దరూ నగల వర్తకులకు గాలం వేశారు. 
 
ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్ అగర్వాల్, మరో ముగ్గురితో కలిసి రూ.1.20 కోట్లతో ఈ నెల 1న హైదరాబాద్ వచ్చి తిరుమల్లేష్‌ను సంప్రదించాడు. అతడు సూచించిన గెస్ట్ హౌస్ చేరుకొని అక్కడ డబ్బు లెక్కిస్తుండగా.. సినీ ఫక్కీలో ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తన బృందంతో వచ్చి లక్ష్మణ్ అగర్వాల్ కణతకు రివాలవార్ గురి పెట్టి బెదిరించాడట. అగర్వాల్‌తోపాటు వచ్చిన వాళ్ళు పారిపోగా.. మొత్తం సొమ్మును అగర్వాల్ తిరుమల్లేష్ ముఠా దోచుకున్నాడు. ఆ తర్వాత బాధితుని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. తిరుమల్లేష్, రాజశేఖర్ ముఠా పరారీలో ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments