Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియుడిని హతమార్చబోయిన యువతి.. కాబోయే భర్తతో కలిసి?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (18:07 IST)
వివాహేతర సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో మాజీ ప్రియుడిని ఓ యువతి హతమార్చేందుకు ప్రయత్నించింది. ఆత్మకూరులో ఓ యువతీ తన మాజీ ప్రియుడిని ఇంటికి పిలిపించి కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నజీర్ అనే యువకుడు అక్కడే స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న ఆసిఫా కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు.
 
అయితే ఇటీవల అసిఫాకు అబ్దుల్ రెహమాన్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఇక పెళ్లి జీవితానికి ప్రియుడు అడ్డుగా వున్నాడని.. నజీర్ సెల్ ఫోన్లో ఉన్న తన ఫోటోలను, చాటింగ్ లను డిలీట్ చేయించాలని భావించిన అసిఫా అతణ్ణి ఇంటికి పిలిపించింది. 
 
అనంతరం తనకు కాబోయే భర్త అబ్దుల్ రెహమాన్ తో కలిసి అసిఫా నజీర్ ను కారుతో ఢీకొట్టించి హతమార్చేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో బయటపడ్డ నజీర్ ను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి అసిఫాను, అబ్దుల్ రెహమాన్ ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments