Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 మంది అమ్మాయిలను ట్రాప్ చేసిన లెక్చరర్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (11:04 IST)
తన వద్ద చదువుకునే అమ్మాయిలకు వల వేశాడో లెక్చరర్. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది అమ్మాయిలను ఆ కామాంధ లెక్చరర్ ట్రాప్ చేశాడు. చివరకు పాపం పండి.. ఓ యువతి దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ లెక్చరర్ బండారం బయటపడింది. ఇది నెల్లూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. తన వద్ద చదువుకునే అమ్మాయిలపై కన్నేశాడు. అలా 15 మందిని ట్రాప్ చేసి ప్రేమ పాఠాలు వల్లించసాగాడు. ఈ క్రమంలో ఓ యువతి మొబైల్ నంబరు తీసుకుని అసభ్యకర చాటింగ్ చేస్తూ, అశ్లీల ఫోటోలు పంపసాగాడు. 
 
అంతేకాకుండా, తనతో సన్నిహితంగా మెలగాలనీ, శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి చేయసాగాడు. అలాగే, ఇతర విద్యార్థినిల వద్ద కూడా ఇదేవిధంగా నడుచుకోసాగాడు. అయితే, ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఓ బాధిత విద్యార్థిని నెల్లూరులో దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments