Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ ప్రవేశ పరీక్షకు 17 యేళ్లు నిండాల్సిందే.. ఏపీ హైకోర్టు స్పష్టత

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (08:54 IST)
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) హాజరయ్యే అభ్యర్థులకు ప్రవేశం పొందిన ఏడాది డిసెంబరు 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టు స్పష్టత ఇచ్చిందని, కనీస వయసును 17 ఏళ్లుగా నిర్ణయించడం సమానత్వ హక్కును నిరాకరించినట్లు కాదని పేర్కొందని గుర్తు చేసింది. 
 
ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. నీట్ రాసే అభ్యర్థులకు అడ్మిషన్ పొందే ఏడాది డిసెంబరు 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ విధించిన నిబంధనను సవాల్ చేస్తూ కడపకు చెందిన 16 యేళ్ల బాలిక హైకోర్టును ఆశ్రయించారు. 
 
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... బాలిక వయసు 4 రోజులు మాత్రమే తగ్గుతోందని, నీట్ రాసేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. మెడికల్ కౌన్సిల్ విధించిన నిబంధన రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును ఉల్లంఘించేదిగా ఉందన్నారు. ఎన్ఎంసీ తరపున న్యాయవాది వివేక్ చంద్రశేఖర్, కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదనలు వినిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments