Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడ్యుకేషన్ కమ్యూనిటి డెవలప్మెంట్ చైర్మన్ గా నేదురుమ‌ల్లి రాం కుమార్ రెడ్డి

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (14:53 IST)
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అంటే తెలియని వారుఉండరు. నేదురుమల్లి కుటుంబం విద్యా వ్యవస్థకు పునాదులు వేసి ఎంతో సేవ చేసింది. మరో విద్యాప్రదాత స్వర్గీయ నేదురుమల్లి బాలకృష్ణ రెడ్డి స్థాపించిన ఎన్ బి కె ఆర్ విద్యా సంస్థలు అంత‌ర్జాతీయ గుర్తింపు పొందాయి. బాలకృష్ణ రెడ్డి మృతి చెందిన తరువాత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఎన్ బి కె ఆర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు, ఆ తరువాత నేదురుమల్లి జనార్ధన్ తనయుడు రాంకుమార్ రెడ్డి బాధ్యత చేపట్టి ఎన్ బి కె ఆర్ విద్యా సంస్థలను రాం కుమార్ రెడ్డి ప‌ర్య‌వే క్షిస్తున్నారు. 
 
ఎన్ బి కె ఆర్ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తూ, రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడుగా రాణిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి సేవలను గుర్తించి రాష్ట్ర హై ఎడ్యుకేషన్ కమ్యూనిటి డెవలప్మెంట్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ చైర్మన్ పదవికి క్యాబినెట్ హోదా కూడా క‌ల్పించ‌డం విశేషం.
 
 
నేదురుమల్లి రాం కుమార్ రెడ్డికి  క్యాబినెట్ హోదా ఛైర్మన్ పదవీ రావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి  ఎమ్మెల్సీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గా, కేంద్రంలో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించారు. అదే విధంగా నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఎమ్మెల్యే నుండి రాష్ట్ర విద్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్ హోదాలో రాష్ట్రహై ఎడ్యుకేషన్ కమ్యూనిటి డెవలప్మెంట్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments