Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోగ్గాడు శోభన్ బాబు జయంతి... రాజ‌మండ్రిలో కోలాహ‌లం!

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (10:43 IST)
సినీ హీరోలు ఎంతో మంది ఉన్నా... న‌ట భూషణ శోభన్ బాబుకు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఆయ‌నను అభిమానించే వారు ఇప్ప‌టికీ ఆయ‌న జ‌యంతి, వ‌ర్ధంతిల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హిస్తారు. ముఖ్యంగా ఆయ‌నకంటూ మ‌హిళ‌ల అభిమాన సంఘాలున్నాయి.
 
 
తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో శోభ‌న్ బాబు అభిమాన సంఘాలు ఆయ‌న‌  86వ జయంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాయి. విశిష్ట వ్యక్తిత్వం, విలక్షణ నట‌న‌, అద్బుతమైన నటనా కౌశలం, అశేష సంఖ్యలో మహిళాభిమానం పొందిన సొగ్గాడు నటభూషణ శోభన్ బాబు అని అభిమానులు కొనియాడారు. సోగ్గాడి 86వ జయంతోత్సవంను సుందర గోదావరి గట్టున శోభన్ బాబు విగ్రహం వద్ద నిర్వ‌హించారు. శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో అభిమానులు ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నిరాడంబరంగా నివాళులు నిర్వహించారు. 
 
 
ఈ సందర్భంగా కార్య‌క్ర‌మంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, అభిమానులను సన్మార్గంలో నిలిపిన మార్గ దర్శకుడు శోభన్ బాబు అని, తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో ఉండే నటుడనీ అన్నారు. ముందుగా శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 
 
 
ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి గౌరవ అధ్యక్షులు అల్లు బాబి, అధ్యక్షుడు కోనగల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, గౌరవ కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు, బట్టిప్రోలు శ్రీనివాస్ (భీమవరం), ఏవీఎస్డీ ప్రసాద్, ఆర్టీఓ రమణ, ఎస్ నాగేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, ఏ అన్నవరం,శోభన్ ప్రకాష్,శర్మ రాంపల్లి,కొత్తపల్లి చంటిబాబు, రాజేంద్ర, మొతికి సత్యనారాయణ, పి వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, సింహాచలం, తణుకు శోభన్ బాబు సేవా సమితి సభ్యులు, జూనియర్ శోభన్ శ్రీనివాస్ బాబు  తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments