Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహామేత.. యువనేత.. యువమేత ఆత్రం... నారా లోకేశ్

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (12:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంద (సిట్)ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పదించారు. మహామేత.. యువనేత.. యువమేత ఆత్రం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'మహామేత', 'యువనేత' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి మహామేత అన్న లోకేశ్.. చంద్రబాబుపై ఆ నాటి వైఎస్ ప్రభుత్వం 26కు పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, నలుగురు అధికారులతో విచారణలు, ఒక సీబీసీఐడీ విచారణ చేయించిందని.. కానీ ఏమైందని ఎద్దేవా చేశారు. 
 
ఇపుడు జగన్ సర్కార్ వచ్చాక.. గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటీకి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారని.. ఏమైందని ట్వీట్ చేశారు. 
 
ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారని.. అది కూడా హత్య కేసులను విచారణ చెయ్యాల్సిన పోలీసులతో సిట్ వేశారని విమర్శించారు. యువమేత ఆత్రం.. ఇక్కడే అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్‌లతో కాలక్షేపం చెయ్యడమే పనిగా పెట్టుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments