లేని చట్టాల పేర్లు చెబుతూ ఎంతకాలం మహిళల్ని మోసం చేస్తారు: జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (17:22 IST)
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాల నేపథ్యంలో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ జగన్ పైన ధ్వజమెత్తారు. లేని చట్టాల పేర్లు చెబుతూ ఇంకా ఎంతకాలం మహిళల్ని ఏమారుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ తప్ప మీకు వేరే మార్గాలు తెలియవని మండిపడ్డారు.
 
మీ నిర్లక్ష్య ధోరణికి ఇంకా ఎంతమంది బలైపోవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజుకు మూడు అత్యాచారాలు జరుగుతున్నాయని, మృగాళ్లు రెచ్చిపోయి చిన్నారులను చిదిమేస్తున్నారని  వెల్లడించారు.
 
విశాఖలో బంగారు భవిష్యత్తు కలిగిన వరలక్ష్మీని మృగాడు బలి తీసుకున్నాడని, బాధిత కుటుంబానికి న్యాయం జరగక ముందే చిత్తూరు జిల్లా రాయల్ పేటలో ఆరేళ్ల బాలకపై లైంగిక దాడి జరిగిందని లోకేశ్ మండి పడ్డారు. వట్టి మాటలను పక్కన పెట్టి మహిళలకు రక్షణ కల్పించాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం