Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌క్తి వుంటే భార్య ఎందుకు రాదు? అక్షింతలను అసహ్యంగా..? జగన్‌పై లోకేశ్ ఫైర్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (21:34 IST)
సీఎం జగన్ తిరుమల పర్యటనపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలేశుని కొండ‌పై గోవింద‌నామాల బ‌దులు జ‌గ‌న్‌ నామస్మ‌ర‌ణ మ‌హాప‌రాధం అంటూ లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. స్వామి అమ్మ‌వార్ల‌కు ప‌దేప‌దే అప‌చారాలు త‌ల‌పెడుతూ మ‌ళ్లీ.. జ‌గ‌న్‌రెడ్డిని ర‌క్షించే గోవిందుడు అంటూ టిటిడి చైర్మ‌న్ స‌తీమ‌ణి అప‌చార‌పు నామ‌స్మ‌ర‌ణ స్వామివారికి తీర‌ని క‌ళంకం అంటూ వ్యాఖ్యానించారు. 
 
భ‌క్తి వుంటే భార్య ఎందుకు రాదు? అంటూ లోకేష్ ప్రశ్నించారు. వేద‌పండితులు త‌ల‌పై వేసిన అక్ష‌త‌ల్ని అస‌హ్యంగా దులుపుకోవ‌డం… ప్ర‌సాదం వాస‌న చూడ‌టం… స్వామిపై ఎందుకీ దొంగ దైవ‌భ‌క్తి జ‌గ‌న్‌రెడ్డి గారూ? అంటూ లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు.
 
"మీ పాపాలకు ప్రాయ‌శ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండ‌ల‌వాడి సేవ‌చేసే అవ‌కాశం దొరికితే…ఆ స్వామికే అప‌చారం త‌ల‌పెట్టే ప‌నులు మంచిది కాదు" అంటూ టీటీడీ ఛైర్మెన్ సుబ్బారెడ్డికి హితవు పలికారు. ఓ బాబాయ్‌కి గొడ్డ‌లిపోటు కానుక‌గా ఇచ్చి.. బాబాయ్ కోటాలో మిమ్మ‌ల్ని.. ఈ స్కీంకి ఎంపిక చేయ‌ని అబ్బాయి మీ పాలిట దేవుడే కావొచ్చని.. ఆయ‌న ఫోటో మీ ఇళ్ల‌ల్లో పెట్టి పూజించుకోండి.. దేవుడిగా కొలుచుకోండి.. వీలైతే పాద‌పూజ చేసుకోండి... అంటూ సెటైర్లు విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments