Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానాలకు మీ పార్టీ రంగులు వేయడం పూర్తయిందా జగన్ గారూ... : నారా లోకేశ్

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (11:36 IST)
ఏపీలోని వైకాపా ప్రభుత్వంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, విమర్శలు గుప్పించారు. అన్ని భవనాలకు పార్టీ రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లకు కూడా వైసీపీ రంగులు వెయ్యడం ప్రారంభించాలంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 'శ్మశానాలకు, మరుగుదొడ్లకు మీ పార్టీ రంగులు పూసుకునే కార్యక్రమం పూర్తయ్యింది కదా జగన్‌గారు. ఇక ఆలస్యం ఎందుకు పోలీస్ స్టేషన్లకు కూడా వైకాపా రంగులు వెయ్యడం ప్రారంభించండి' అంటూ ట్వీట్ చేశారు.
 
'శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులతో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమకేసులు పెట్టిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలపై ఏకంగా పోలీసులతోనే దాడులు చేయిస్తున్నారు. తిరుచానూరులో టీడీపీ కార్యకర్త హేమంత్‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని నారా లోకేశ్ మరో ట్వీట్ చేశారు.
 
'ముఖ్యమంత్రి జగన్ తన ఫ్యాక్షన్ కోరికలను పోలీసుల ద్వారా తీర్చుకుందామనే సరికొత్త పంథా ఎంచుకున్నారు. ఇకపై ఉపేక్షించేది లేదు. అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కించే న్యాయ పోరాటం ప్రారంభించబోతున్నాం' అని నారా లోకేశ్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments