Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం వెల‌గ‌బెడుతున్న‌ది వైకాపానా? తెదేపానా? : లోకేశ్

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (14:19 IST)
ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. రైతులకు విత్తనాలు అందక పడుతున్న అవస్థలపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
వైకాపా అధికారంలో ఉంద‌ని మ‌రిచిపోయారా? విత్త‌నాలో జ‌గ‌న్ ప్ర‌భో అంటూ రైతులు గ‌గ్గోలు పెడుతుంటే.. చంద్ర‌బాబు వ‌ల్లే విత్త‌నాలు ఇవ్వ‌లేక‌పోతున్నామంటున్నారు. 

ఒక‌టో తారీఖుకొచ్చే పింఛ‌ను రాలేదేమ‌ని పండుటాకులు నిల‌దీస్తే! గ‌త ప్ర‌భుత్వం వ‌ల్లే ఆల‌స్య‌మైంద‌ని స‌మాధానం ఇస్తున్నారు. బీమా రాలేదు.. మా బ‌తుకుల ధీమా ఏదీ అంటే! తెలుగుదేశం స‌ర్కారు వ‌ల్లే అంటూ మాట దాట‌వేస్తున్నారు.
 
 నేను విన్నాను.. నేను ఉన్నానంటూ సీఎం అయ్యి, పాలన చేతకాక.. ఇప్పుడు చంద్ర‌బాబే వింటాడు.. చంద్ర‌బాబే ఉంటాడు అంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం వెల‌గ‌బెడుతున్న‌ది వైకాపానా? తెదేపానా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments