Webdunia - Bharat's app for daily news and videos

Install App

జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా? నారా లోకేశ్ సూటి ప్రశ్న

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (15:39 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు విమర్శలు గుప్పించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో పలు పోస్టులు పెట్టారు. వినేవాళ్లు అమాయకులైతే చెప్పేవారు జగన్ అన్నట్టుంది పరిస్థితి అంటూ సెటైర్ వేశారు. 
 
అంతేకాకుండా, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నిధులు లేవని దొంగ ఏడుపులు ఏడుస్తున్న జగన్... వైకాపా కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి రూ.233 కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? అని నిలదీశారు. 
 
గ్రామ వాలంటీర్లు అని పేరు మార్చిన వైకాపా కార్యకర్తల కోసం ఫోన్లు కొంటూ రివర్స్ టెండర్‌లో రూ.83 కోట్లు ఆదా అంటూ చెవిలో జగన్ క్యాబేజీ పెట్టారు. వైకాపా ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, రెండు సార్లూ ఒకే కంపెనీ టెండర్ వేసింది. ఈ స్కీంలో రూ.233 కోట్ల ప్రజాధనానికి జగన్ టెండర్ పెట్టడం తప్ప రివర్స్ టెండరింగ్ ఎక్కడ ఉంది?.
 
ఇకపోతే జగన్ పారదర్శకత ప్రకారం రూ.100 కోట్లు దాటిన టెండర్లకు జ్యూడిషయల్ ప్రివ్యూ జరగాలి. మరి ఫోన్ల టెండర్లను ప్రివ్యూకు పంపలేదే? అంటే జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా జగన్? అంటూ తన ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments